Reading Time: < 1 minute

‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివా స మంగాపురం’ కు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, జయ కృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కూడా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. సక్సెస్ ఫుల్ నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండగా, ‘చందమామ కథలు’ బ్యానర్ పై నిర్మాత పి కిరణ్ దీనిని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి రాషా థడానీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమెను ‘మంగ’ పాత్రలో పరిచయం చేశారు. సాంప్రదాయ దుస్తులలో రాషా అద్భుతంగా కనిపిస్తోంది.