Reading Time: < 1 minute

అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేశారని వైసిపి నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో ఎక్కడా జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిన సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారని దుయ్యబట్టారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారని, తనపై కేసులు పెడితే ఎదుర్కొంటాం కానీ దుష్ప్రచారాన్ని మాత్రం సహించమన్నారు. ‘వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా?.. మీ పాలనలో జరిగిన పాపాలను మాపై రుద్దుతున్నారు’ అని అంబటి విమర్శించారు.