Reading Time: < 1 minute

హైదరాబాద్: చైనా మాంజా చుట్టుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో చైతన్య చేయి తెగింది. తీవ్రంగా గాయపడిన చైతన్యను స్థానికులు మాదాపూర్ ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ అవగాహన లేక కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి గాలిలో వేలాడుతున్నాయి. దీంతో వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.