Reading Time: < 1 minute

శర్వానంద్ హీరోగా.. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్.. ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నవ్వులు పూయిస్తుంది. గతంలో ప్రేమించిన అమ్మాయి.. ఇప్పుడు ప్రేమిస్తున్న అమ్మాయికి మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తిగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. సంయుక్త, సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్లు. సత్య, సునీల్, సుదర్శన్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ‘నారీ నారీ నడుమ మురారి’ ట్రైలర్ చూసేయండి..