Reading Time: < 1 minute

వడోదర: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు తొలి వికెట్‌కి 117 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి స్వల్ప వ్యవధిలోన ఔట్ అయ్యారు. దీంతో బ్యాటింగ్ వచ్చిన మిచెల్ విజృంభించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా.. పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 84 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిగితా వారందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా, సిరాజ్, ప్రశిద్ధ్ చెరి రెండు, కుల్దీప్ ఒక వికెట్ తీశారు.