
గుజరాత్: శౌర్యానికి పరాక్రమానికి సోమనాథుడు ప్రతీకని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఇది మనకు అద్భుతమైన క్షణాలని అన్నారు. సోమనాథ్ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. 1983 ఇండోర్ మహారాణి సోమనాథ మందిరాన్ని పునర్ నిర్మించారని, ఇది కేవలం చరిత్ర కాదు.. మన ధైర్య సాహసాల ఇతి వృత్తం అని కొనియాడారు. ఎన్నో దాడులను సోమనాథ ఆలయం తట్టుకుందని, సోమనాథుడి ఆలయంతో పాటు భారత్ పైనా దండెత్తారని అన్నారు. ఎన్నోసార్లు మందిర స్వరూపాన్ని మార్చేశారని, హత్యలు చేశారని, మహిళలను చెరబట్టారని చెప్పారు. సోమనాథుడిని రక్షించిన యోధులకు వందనాలు తెలియజేశారు. స్వాభిమాన్ పర్వ్ లో పాల్గొనడం అదృష్టం అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోమనాథ్ ఆలయ పునర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ ఉన్నాయని, వ్యతిరేక శక్తులను ఓడించడానికి పౌరులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. సంపద కోసం ఆలయంపై దాడి జరిగినట్లు తప్పుదోవ పట్టించారని, అనేక సార్లు ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారని మోడీ పేర్కొన్నారు.