
భోపాల్: అతనో పురోహితుడు.. పౌరోహిత్యం చేసి సంపాదించిన డబ్బులతో భార్యను ఎస్‌ఐని చేశాడు. కానీ, ఎస్ఐ అయిన తర్వాత ఆమె అతడికి షాక్ ఇచ్చింది. పిలక, పంచెకట్టు నచ్చేలేదని అతడికి విడాకులు ఇచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. కష్టపడి భార్యను ప్రయోజకురాలని చేస్తే.. ఆమె అతడికి వెన్నుపోటు పొడిచింది. ఆమెను సబ్-ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) ఉద్యోగం సాధించడంలో అండగా నిలిచాడు. అయితే, ఎస్‌ఐ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.
భర్త సంప్రదాయబద్ధంగా ధరించే ధోతీ-కుర్తా, తలకు ఉండే శిఖ(పిలక) తనకు నచ్చడం లేదని.. తన హోదాకు అవమానకరంగా ఉన్నాయని ఆమె వాదించడం మొదలు పెట్టంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమె భర్త నుంచ విడాకులు కావాలని ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్తతో కలిసి ఉండాలంటే ఇబ్బందిగా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. న్యాయమూర్తులు, కౌన్సిలర్లు రాజీ చేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్‌ఐ తీసుకున్న నిర్ణయం తెలిసి నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు.