
వడోదర: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా భారత్‌తో్ జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కి ఓపెనర్లు డెవాన్ కావ్వాయ్, హెన్రీ నికొలస్ మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్‌కి 117 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్థ శతకాలు సాధించారు. చివరకు ఈ భాగస్వామ్యాన్ని హర్షిత్ రాణా విడగొట్టాడు. హర్షిత్ వేసిన 22వ ఓవర్ నాలుగో బంతికి నికొలస్(62) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హర్షిత్ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ కాన్వాయ్ (56) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజ్‌లో యంగ్ (8), మిచెల్ (4) ఉన్నారు.