Reading Time: < 1 minute

అమరావతి: రాజ్యాంగంలో క్యాపిటల్ పదం లేదనడం..అవగాహనరాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చురకలంటించారు. అమరావతిపై అసంబద్ధ ప్రకటనతో మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్వులపాలవుతున్నారని విమర్శించారు. రాజధానిపై వేర్వేరు మాటలు చెప్పడం.. గందరగోళాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోని అనేక రాజధానుల నదీతీరాలు పక్కనే ఉన్నాయని, అమరావతి అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే జగన్ లక్ష్యంగా తెలుస్తోందని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.