Reading Time: < 1 minute

వడోదర: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరలోని బిసిఎ స్టేడియం వేదికగా న్యూజిలండ్దతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది ఇరు జట్లు ఆడుతున్న తొలి సిరీస్ ఇది. దీంతో ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఏడాదిని శుభంగా ప్రారంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక భారత్‌లో పేస్ అటాక్‌లో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ధ్‌లు ఉండగా.. స్పిన్నలర్లుగా వాషింగ్టన్, జడేజా, కుల్దీప్ ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులోకి క్రిస్టెన్ క్లార్క్ ఆరంగేట్రం చేస్తున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా ఆదిత్య ఆశోక్‌ను ఎంపిక చేశారు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

న్యూజిలాండ్: డేవన్ కాన్వాయ్, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డరెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), జకరి ఫోల్క్‌స్, క్లిస్టెన్ క్లార్క్, కైల్ జెమిసన్, ఆదిత్య అశోక్.