Reading Time: < 1 minute

ఉప్పల్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ లో చైనా మాంజాతో మరొకరి మెడ తెగింది. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ వెళ్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాయి వర్ధన్ రెడ్డి చైనా మాంజా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాంజా సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఉప్పల్ పోలీసులు సూచిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలోని  కొత్త ఫ్లైఓవర్ పై చైనా మాంజా తగలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కీసరలో మరో వ్యక్తి చైనా మాంజా మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓల్డ్ మిర్జాల్‌గూడలో మాంజాను లాగడంతో 33 కెవి కరెంట్ తీగ తెగింది. మాంజాలకు చిక్కుకొని పావురాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. పావురాల బాధ అరణ్యరోదనగా మారింది.