Reading Time: < 1 minute

లక్నో: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై ఎస్‌ఐ, యూట్యూబర్ సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. ఇద్దరిని అరెస్టు చేయగా ఎస్ఐ మాత్రం పరారీలో ఉన్నాడు. సదరు ఎస్‌ఐని పట్టిస్తే రూ.50 వేలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనవరి 7న బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. యుట్యూబర్ శివబరణ్, ఎస్‌ఐ అమిత్ మౌర్య కలిసి బాలికను ఎత్తుకెళ్లారు. అనంతరం కారులో బాలికపై ఇద్దరు సామూహిక అత్యచారం చేశారు.  అనంతరం బాలికను ఇంటి సమీపంలో వదిలిపారిపోయారు. బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే సదరు ఎస్‌ఐని సస్పెండ్ చేశారు. యుట్యూబర్ జర్నలిస్టు శివబరన్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ పరారీలో ఉండడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌ఐని పట్టిస్తే రూ.50 వేలు ఇస్తామని ఎసిపి వికెసింగ్ తెలిపారు. ఈ కేసులో అలసత్వం వహించిన పోలీస్ అధికారులు దినేశ్ కుమార్, శిఖర్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. పోలీస్ అధికారి ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రక్షించేవాడు భక్షకుడు అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యుపిలో శాంతి భద్రతలు తగ్గినట్టు అనిపిస్తుందని వాపోతున్నారు. రోజు రోజుకు యుపిలో క్రైమ్ రేటు పెరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.