Reading Time: 2 minutes

మెగాస్టార్ చిరంజీవి… హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ’మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ’మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా కూడా చూపించని ఒక ఎమోషనల్ పాయింట్ ఈ సినిమాలో ఉంది. అది స్క్రీన్ మీద చూడాలి. సినిమాలో కామెడీతో పాటు ఒక బలమైన ఎమోషనల్ రైడ్ ఉంటుంది. చిరంజీవి, నయనతార, పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి. – భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారనేది చాలా కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. అది కచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్టే కదా అని ఫీల్ అవుతారు. చిరంజీవికి నేను చెప్పిన ఐడియా చాలా నచ్చింది. అలాగే క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. ఈ మధ్యకాలంలో క్యారెక్టరైజేషన్‌తో పాటు నడిచే కథ నేను చేయలేదు. ఒక కథని హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే తీసుకెళ్లడం అనేది నాకు కొత్తగా అనిపించింది. -చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత అన్నయ్య, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది లాంటి ఫ్యామిలీ జోనర్ ని ఆయన టచ్ చేయలేదు. అది ఎప్పుడు నాకు మైండ్‌లో ఉంది. ఇది చాలా అద్భుతమైన బ్లాక్‌బస్టర్స్ వున్న జానర్. ఈ జానర్ లో ఆయనకు సినిమా చేయాలనే ఆలోచనతో ఈ కథని సిద్ధం చేశాను. -చిరంజీవి చేసే అల్లరి, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా ప్రేక్షకులు అందరినీ ఒక టైం మిషన్‌లో తీసుకెళ్ళినట్టుగా ఉంటాయి. ఆయన్ని నటుడిగా, వ్యక్తిగా అభిమానించే అందరూ సినిమా చూసిన తర్వాత ’వావ్’ అంటారనే నమ్మకం వుంది.

-చిరంజీవి లాంటి మెగాస్టార్ ఉన్నప్పుడు ఆయనకు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ ఉండాలి. యాక్షన్, ఫన్ ఉండాలి. ఆయన ఇమేజ్ ని కొనసాగిస్తూ సినిమా చేయడం జరిగింది. అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా కోసం చిరంజీవి, వెంకటేష్ నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. చిరంజీవి, వెంకటేష్‌తో కలిసి చేసిన 18 రోజులు షూటింగ్ చేయడం నా కెరీర్‌లో మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. -చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ 20 నిమిషాలు నాన్ స్టాప్‌గా ఉంటుంది. ఇందులో వెంకటేష్ కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడ అనే ఒక మైనింగ్ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. పాటలన్నింటికీ మంచి స్పందన వస్తోంది”అని అన్నారు.