Reading Time: 2 minutes

స్వతంత్ర భారత రెండవ ప్రధాన మంత్రి, పరమ దేశభక్తుడు, అద్వితీయ దార్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి 11 జనవరి 1966న ఉబ్జెకిస్థాన్, రష్యాలో ఉదయం తుది శ్వాస విడిచారు. 1965 ఇండో-పాక్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేలా ప్రయత్నాల్లో భాగంగా తాష్కంట్ ఒప్పందంలో సంతకం చేయడానికి వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించం, మరణానంతరం పోస్ట్మార్టమ్ కూడా చేయకపోవడం, గుండె పోటుతో మరణించారని అధికారిక ప్రకటన చేయడం గత 60 ఏండ్లుగా వారి మరణం వీడని మిస్టరీగానే మిగిలి పోవడం విచారకరం.

జై జవాన్; జై కిసాన్ అనబడే అత్యంత శక్తివంతమైన, అవసరమైన నిత్య నినాదాన్ని ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి దేశాభివృద్ధిలో రైతులు, సైనికుల పాత్రను నొక్కివక్కానించారు. అపరిమిత అంకితభావం, నైతిక ప్రవర్తన, నీతివంతమైన పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రధాని పదవి ఇన్నప్పటికీ అత్యంత సరసమైన జీవన విధానాన్ని కొనసాగించడం, దేశ భద్రతపై పట్టు సా ధించి భరతమాత ముద్దు బిడ్డగా చరిత్రలో నిలిచారు. 1965లో జ రిగిన ఇండో-పాక్ యుద్ధంలో శాస్త్రి చూపిన తెగువ, భారత్ను యు ద్ధంలో విజేతగా నిలిపి జాతీయ, ఆంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రధానిగా శాస్త్రి ప్రతిభగల పాలన విధానాలు దేశానికి రాజకీయ, ఆర్థిక పునాదులను పటిష్ట పరిచారు.

యూపీ, ముగల్సరాయ్ నగరంలోని ఒక సాధారణ కుటుంబంలో 02 అక్టోబర్ 1904న జన్మించిన లాల్ బహదూర్ కాశీ వి ద్యాపీఠ్ ప్రాంగణంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొంటూ మహాత్మా గాంధీతో దగ్గర అయ్యారు. చదువుకున్న సమయంలోనే లాల్ బహదూర్ చూపిన ప్రతిభను మెచ్చి శాస్త్రి అనే మేధావిగా బిరుదును పొందారు. స్వతంత్ర భారత ప్రభుత్వంలో రైల్వే/విదేశాంగ/హోమ్ లాంటి మంత్రి పదవులను నిర్వహించి తన పాలనాదక్షతను రుచి చూపి 2వ ప్రధాన మంత్రిగా 1964-66 మధ్య సేవలు అందిస్తూ అకాల మరణం చెందారు. శాస్త్రీ గారి అకాల, అనుమానాస్పద మరణం నాటి దేశానికి తీరని వేదనను మిగిల్చింది.

అజాతశత్రువు, అలుపెరుగని సేవకుడు, నీతి నిజాయితీకి మారుపేరు, నిత్య కృషీవలుడు, ఆలోచనపరమైన ముందు చూపు, ఆధునిక భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన దేశ భక్తిపరుడి 59వ వర్థంతి సందర్భంగా శాస్త్రి స్మారక విజయ్ ఘాట్ సాక్షి గా హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. శాస్త్రి గారి సేవలకు గుర్తింపుగా మ రణా నం తరం 1966లో భారత రత్న పౌర పురస్కారం కూడా ఇవ్వడం సముచితంగా ఉన్నది. లాల్ బహదూర్ శాస్త్రీ జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవాలని, దేశ పౌర సమాజానికి దారిదీపం కావాలని కోరుకుందాం.

– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

(నేడు లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి సందర్భంగా)