Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: నేను వైద్యుడిని కాదు, కానీ, సోషల్ డాక్టర్‌ని అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హెచ్‌ఐసిసిలో ఫెలోస్ ఇండియా సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్, ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైఫ్ సెన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు. మనుషులు, సమాజంపై వైద్యులు తమ బాధ్యతను ఎప్పటికీ మరిచిపోవద్దని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతని స్తోందని ఆయన తెలిపారు. వైద్యులు అధునాతన సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆయన సూ చించారు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో మనం భాగస్వాములం అవుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనం కలిసి పని చేద్దామని ఆయన కోరారు. విద్యార్థులకు సిపిఆర్ నేర్పేందుకు ముందుకు వస్తే చాలా మంది ప్రాణాలను కాపాడగలమన్నారు. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కోసం అందరూ కృషి చేయాలని ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమం కావాలని ఆయన సూచించారు.

యువ కార్డియాలజిస్టులకు స్వాగతం

భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా ఇక్కడకు వచ్చిన యువ కార్డియాలజిస్టులు అందరికీ స్వాగతమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాలజిస్టులని, అయినా మీ నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికే ఈ కాన్ఫరెన్స్ కు వచ్చారని సిఎం రేవంత్ తెలిపారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్‌కు ముగింపు పలికినట్లేనని సిఎం రేవంత్ సూచించారు. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో జరగడం ఎంతో గర్వకారణమన్నారు. చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకున్నా అందుకు అర్హత సాధించలేరని, మీరంతా సమాజంలో ఒక ప్రత్యేక గ్రూప్‌గా మనుషుల ప్రాణాలు కాపాడుతారని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన తెలిపారు.

మనుషుల పట్ల, సమాజంపై మీ బాధ్యతను మరచిపోవద్దు

మనుషుల పట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం తమ పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి తమకు సహకరించాలని ఆయన సూచించారు. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయని, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉందని సిఎం రేవంత్ తెలిపారు. అందుకే తాజా టెక్నాలజీపై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోవాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. అప్ గ్రేడ్ చేసుకునే విషయంలో ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దని సిఎం రేవంత్ సూచించారు.

ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలి

ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో మనమందరం భాగస్వాములం అవుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దామన్నారు. విద్యార్థులకు సిపిఆర్‌ను బోధించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన యువ వైద్యులకు పిలుపునిచ్చారు. మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలం, చాలా సార్లు మనం నివారణ గురించి నిర్లక్ష్యం చేస్తుంటాం, కానీ, ప్రజలకు అవగాహన కల్పించగలిగితే సమాజం ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని, ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలనిసిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.