Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణలో పెట్టుబడి రేటును ప్రస్తుత 37శాతం నుంచి 50శాతానికి పెంచాల్సి ఉందని, రాష్ట్రాల ద్రవ్య లోటు ప రిమితిని ఏడాదికి కనీసం 4శాతానికి పెంచాలని కోరారు. రాష్ట్రాలకు ఇస్తున్న 50ఏళ్ల వడ్డీ లేని రు ణాలను గ్రాంట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలన్నారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశా రు. శనివారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో ప్రీబడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ఈ మేరకు విజ్ఞ ప్తి చేశారు. అలాగే తెలంగాణలో ప్రాంతీయ రిం గ్ రోడ్ ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సం బంధించి త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం తన మొత్తం వ్యయంలో 20శాతం కంటే ఎక్కువ రా ష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోంద ని, ఇందులో 25శాతం తగ్గించి, ఆ రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచించారు. ప్రస్తుతం సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చే రిందని, దీని వల్ల 15వ ఆర్థిక సంఘం 41 శా తం పన్ను బదిలీని సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్రాలకు కేవలం 30 శాతం మాత్రమే అందుతోందని అన్నారు. దాదాపు రూ.1,55,000 కోట్ల సర్ ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని, లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటును ప్రకటించాలని, మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలను మంజూరు చేయాలన్నారు.

అభివృద్ధి పనులకు నిధులివ్వండి

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ14,100 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం రూ45,000 కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ17,212 కోట్లు కేటాయించాలని బడ్జెట్ ముందస్తు సమావేశంలో భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. తెలంగాణలో ప్రస్తుతం 1000కి పైగా కులాల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, తమ ప్రభుత్వం 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇక్కడ అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకుంటారని, అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాము తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించామని డిప్యూటీ సీఎం తెలిపారు.

తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచుతాం

తెలంగాణను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుండి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. తద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఒక దేశం కేంద్ర -రాష్ట్రాల సమన్వయం ద్వారానే పురోగమిస్తుందని, కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం ముఖ్యమైన చొరవ అన్నారు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని, అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నానన్నారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతం అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో తమ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్రాలతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.