Reading Time: < 1 minute

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అతని మొదటి చిత్రం ’శ్రీనివాస మంగాపురం’కు ఆర్‌ఎక్స్ 100, మంగళవారం లాంటి మరపురాని సినిమాలని అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. శనివారం సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న కొడుకైన జయ కృష్ణ తొలి చిత్రం పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జయ కృష్ణ దుమ్ము ధూళి ఎగసే రగ్గడ్ బ్యాక్ డ్రాప్ లో హై స్పీడ్‌లో బైక్ నడుపుతూ కనిపించారు. ఈ సినిమాను టీమ్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ 2026గా బ్రాండ్ చేస్తోంది. మొత్తంమీద ఫస్ట్ లుక్ ఒక గ్రిప్పింగ్, హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాని చూపించింది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రాషా తడాని టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.