Reading Time: < 1 minute

 అమెరికా హెచ్ 1 బి వీసాలు భారం కానున్నాయి. ఇతర వీసాలను కూడా అమెరికా పౌరసత్వ వలసల విభాగం పెంచింది. ఈ మేరకు అధికార ప్రకటన వెలువరించింది. మార్చి 1 నుంచి హెచ్ 1 బి వీసాల ప్రాసిసింగ్ ఫీజు పెంపుదల అమలులోకి వస్తుంది. అదే విధంగా ఎల్ 1 వీసాల పరిశీలన రుసుం కూడా పెరుగుతుంది. హెచ్ 1 వీసా ప్రాసిసింగ్ ఫీజు ఇంతకు ముందు 2805 డాలర్లు ఉండగా మార్చి నుంచి ఇది 2965 డాలర్లకు చేరుతుంది. యుఎస్‌సిఐఎస్ అధికార యంత్రాంగం తమ ప్రకటనలో మార్చి 1 తేదీ నుంచి అమలులోకి వచ్చే నూతన రేట్ల వివరాలను తెలిపింది. ఇతర వర్క్ వీసా కేటగిరిల్లో కూడా హెచ్చింపు చోటుచేసుకుంది. ఉద్యోగ సంబంధిత వర్క్ పర్మిట్ల వీసాలపై పెంపుదలకు ఇంతకు ముందే ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 1 నుంచి అమలులోకి వస్తుంది.