Reading Time: < 1 minute

ఎ1 తొమ్మిది సీట్ల ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ రౌర్కెలా వద్ద శనివారం కూలి ఆరుగురు గాయపడ్డారని ఒడిశా వాణిజ్య ,రవాణా మంత్రి బిబి జెనా వెల్లడించారు. రౌర్కెలాకు 10 కిమీ దూరంలో జల్దా వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. ఆరుగురిలో ఇద్దరు మహిళలతోసహా నలుగురు ప్రయాణికులు కాగా, మరో ఇద్దరు పైలట్లని రౌర్కెలా ఎస్‌పి నితేష్ వద్వానీ వివరించారు. కెప్టెన్ నవీన్, కెప్టెన్ తరుణ్ ఈ ఫ్లైట్‌ను నడుపుతున్నారని చెప్పారు. తలకు తీవ్ర గాయమైన నవీన్‌ను మరొకరిని ఐసియులో చికిత్స చేస్తున్నారని చెప్పారు. శంబల్‌పూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులకు, పైలట్లకు తగిన సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.