
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డివై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైన ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆ నొప్పి నుంచి తేరుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఢిల్లీ ఈ మ్యాచ్‌లో నెగ్గి సీజన్‌ని ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై తమ జట్టులో ఒక మార్పు చేసింది. సైకా స్థానంలో త్రివేణి జట్టులో ఆరంగేట్రం చేస్తోంది.
ముంబై జట్టు: అమేలియా కెర్, జి కమలిని(కీపర్), నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా క్యారీ, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, పూనమ్ ఖేమ్‌నార్, త్రివేణి వసిస్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా.
ఢిల్లీ జట్టు: షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), లిజెల్ లీ(కీపర్), మారిజానే కాప్, నికి ప్రసాద్, చినెల్లె హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ.