
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెండో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. యుపి వారియర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యుపి జట్టు గుజరాత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ సోఫి డివైన్ 38, అనుష్క శర్మ 44, అష్లే గార్డ్‌నర్ 65, జార్జియా వేర్హామ్ 27(నాటౌట్) పరుగులతో రాణించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యుపి జట్టు లక్ష్య చేధనలో పోరాడి విఫలమైంది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్(78) పరుగులతో విజృంభించినా.. ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 30, ఆశా శోభన 27, శ్వేతా శెరావత్ 25 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లు స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో యుపి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులకే పరిమితం కావడంతో గుజరాత్ ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ రాణించిన జార్జియా వేర్హామ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.