Reading Time: < 1 minute

ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్ ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీకొన్ని ఘటనలో నలుగురు చనిపోయారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు హోషియాపూర్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాద ంచోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.