
లక్నో: కూతురును కిడ్నాప్ చేస్తుండగా తల్లి అడ్డుకోవడంతో ఆమెపై పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో చనిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో సర్ధానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కప్సాద్ గ్రామంలో సునీత, సతేంద్ర జాతావ్ అనే దళిత దంపతులు నివసిస్తున్నారు. తన 20 ఏళ్ల కూతురు కలిసి దంపతులు పొలం పనులకు వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన పారస్ సోమ్, సునీల్ సోమ్ అనే యువకుడు మరో ముగ్గురుతో కలిసి సునీత కూతురు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. దంపతులపై గన్ పాయింట్ పెట్టి కూతురు కిడ్నాప్ చేస్తుండగా సునీత అడ్డుకుంది. పదునైన ఆయుధంతో తల్లిపై దాడి చేసి యువతిని తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన తల్లిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఈ విషయం యుపి వ్యాప్తంగా తెలియడంతో గ్రామానికి రాజకీయ నాయకులు, మహిళా సంఘాలను రానివ్వడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.