
హైదరాబాద్: మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ అనుమతి ఇచ్చింది. జనవరి 11న సాయంత్రం 8 గంటల నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతిచ్చింది. టికెట్ రేటు రూ.600గా నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఎపి ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధర జిఎస్‌టితో కలిసి రూ.50, మల్టీఫ్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధరపై జిఎస్‌టితో కలిసి రూ.100 ఆదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. రోజుకు ఐదో షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు.