
చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా హైదరాబాద్‌లో చైనా మాంజా విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉన్నాయనేందుకు నగరంలో అంబర్‌పేటలో తాజాగా చోటు చేసుకున్న మరో ఘటనే తార్కా ణంగా నిలుస్తోంది. చైనా మాంజా వల్ల అంబర్‌పేటలో మరో వ్యక్తి వీరయ్య గాయపడ్డాడు. అంబర్ పేట్ నూతన ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన చోటు చేసు కుంది. గోల్నాక నుండి రామంతపూర్ వైపు టూవీలర్‌పై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాంజా మెడకు చుట్టుకుని లోతు గా గాయం చేసింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రజలు అతన్ని అంబర్‌పేట్‌లోని ట్రైకలర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇటీవల పాతబస్తీలో జమీల్ అనే యువకుడి గొంతు కోసుకు పోవడం, దిల్ సుఖ్ నగర్, సరూర్‌నగర్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం వంటివి చైనా మాంజా ఎంత ప్రమాదకరమో తెలియపరుస్తున్నాయనడంలో సందేహంలేదు.