Reading Time: < 1 minute

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బిష్నా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డుపై స్కూల్ బస్సు బోల్తా పడడంతో 35 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఎయిమ్స్, జిఎంసి ఆస్పత్రలకు తరలించారు. సాంబాలో పిక్నిక్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో బస్సు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్టు సమాచారం. విద్యార్థులు ప్రెగ్వాల్ అక్నూర్ కు చెందిన వారిగా గుర్తించారు.  విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.