ఈ మధ్యకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా శాతం మంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి. డయాబెటిస్‌కు సంబంధించిన మెడికేషన్‌ను తీసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలా శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతుంటే, అన్నం తినకూడదు అని అలవాటును మార్చుకుంటారు. కానీ ఈ అలవాటును మానుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అన్నం తిన్నా సరే, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు మాత్రమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారు కూడా అన్నం తినడం మానేస్తారు. అయితే, సరైన పద్ధతిలో అన్నాన్ని తినడం వలన ఎలాంటి సమస్యలు రావు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏ బియ్యం ను తీసుకున్నా సరే సరైన పద్ధతిలో వండుకుని తినడం వలన ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ముఖ్యంగా పాత బియ్యాన్ని ఎంపిక చేసుకోవడం వలన ఎన్నో పోషకాలను పొందవచ్చు. బియ్యాన్ని నానబెట్టిన తర్వాత మాత్రమే వండుకుని తినాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే బిర్యానీ నానబెట్టుకుని తింటారో, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. కనీసం అరగంట లేక గంట వరకు బియ్యాన్ని నానబెట్టుకుని తినడం వలన ఆహారం ఎంతో సులువుగా జీర్ణం అవుతుంది.
దీంతో బియ్యంలో ఉండే ఎంజైమ్స్, పోషకాలు మరింత అందుతాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు మరియు బరువు తగ్గాలనుకునే వారు బియ్యాన్ని నీటిలో వండిన తర్వాత గంజి వార్చి తినాలి. ఇలా చేస్తే బియ్యంలో ఉండే పిండి పదార్థాలు తగ్గుతాయి. దీంతో ఆహారం ఎంత త్వరగా జీర్ణం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఎప్పుడైతే బియ్యాన్ని ప్రెజర్ కుక్కర్‌లో వండుతారో, దానిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కనుక ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించవద్దు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
The post ఈ పద్ధతిలో అన్నాన్ని తింటే.. షుగర్ లెవెల్స్ ను కూడా అదుపులో ఉంచవచ్చు..! appeared first on Manalokam – Latest Telugu News & Updates.