Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై‌పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయగా.. ముంబై 9 వికెట్లు కోల్పోయి 123 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో తమ ఓటమి గురించి కెప్టెన్ హార్థిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటమికి తమ బౌలింగ్ యూనిటే కారణమని హార్థిక్ అన్నాడు.

‘‘మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి నుంచి మా భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మేం బౌలింగ్‌లోనే సరిగ్గా రాణించలేదు. నాతో సహా మా బౌలింగ్ బృందం మొత్తం విఫలమైంది. ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్‌దే బాధ్యత. కనీసం ఐదు బంతులైనా.. సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడు ముంబైకి పోరాడే అవకాశం లభించేది’’ అని హార్థిక్ తెలిపాడు. రాజస్థాన్ జట్టుపై హార్థిక్ ప్రశంసలు కురిపించాడు. ‘‘రాజస్థాన్ జట్టు గొప్పగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. వెనేకబడిపోయాం’’ అని అన్నాడు.