
చెన్నై: ఎన్నికలకు కొన్ని వారాల ముందే నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టివికె)కు బిగ్ షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టివికె అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఎన్నికల ముందే టివికె పార్టీ ఒక సీటు కోల్పోయింది. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకం అవసరం.. కాగా, టివికె అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్‌లో కేవలం 8 సంతకాలు మాత్రమే సమర్పించింది. ఇదే కారణంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి నిత్య నామినేషన్‌ను కూడా తిరస్కరించింది ఇసి. ఆమె నామినేషన్ లో కేవలం 7 సంతకాలు మాత్రమే ఉన్నాయి.
కాగా, తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది..మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.