Reading Time: 2 minutes
Indian Railways: ఈ ట్రిక్ పాటిస్తే రైళ్లలో మీకు టికెట్ కన్ఫామ్.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందవచ్చు.

రైళ్లల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు లేదా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, రైల్ వన్ యాప్‌తో పాటు పలు థర్డ్ పార్టీ బుకింగ్ యాప్స్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అత్యవసరం ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే మీకు అప్పటికీ టికెట్ లభించకపోతే ‘చార్ట్స్ వేకెంట్’ ఫీచర్ ద్వారా సులువుగా బెర్త్ పొందవచ్చు. ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని తెలుసుకుని సీటు పొందవచ్చు. దీని వల్ల చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీరు కన్ఫర్మ్డ్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు తత్కాల్ టిక్కెట్ కంటే ఈ ఫీచర్‌తో సీటు పొందడమే సులభం. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంనేది చూద్దాం.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి ‘చార్ట్స్ వేకెంట్’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి ఏ రైలు, కోచ్‌లలో ఖాళీ సీట్లు ఉన్నాయో చెక్ చేయాలి. ఒకవేళ సీటు అందుబాటులో ఉంటే దానిని వెంటనే బుక్ చేసుకోవచ్చు. మొదటి చార్ట్ సాధారణంగా రైలు బయల్దేరడానికి సుమారు నాలుగు గంటల ముందు ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే ఈ విధానం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు రైలు బయల్దేరడానికి సుమారు 5 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉన్న సీట్లను బుక్ చేసుకోవచ్చు. సాధారణ ఛార్జీలే ఈ బుకింగ్స్‌కు వర్తిస్తాయి. కొన్ని రైళ్లలో 10 నుండి 30 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే ఈ విధంగా బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేస్తే రీఫండ్ ఉండదు. కరెంట్ బుకింగ్ ద్వారా పొందిన టిక్కెట్లు వెంటనే ధృవీకరించబడతాయి. వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ ఉండదు.

ఈ టికెట్లు బుకింగ్ చేసిన వెంటనే సీటు ఖరారు అవుతుంది. వారాంతాలు, సెలవులు లేదా పండుగల కంటే సాధారణ పని దినాల్లో ఖాళీ సీట్లు ఎక్కువగా లభిస్తాయి.అటువంటి రోజులలో 80 నుండి 90 శాతం సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఏదైనా సీటు ఖాళీగా ఉంటే.. దానిని వెంటనే బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక ప్రయాణికుడు మధ్యలో మరో స్టేషన్‌లో దిగితే.. ఆ విషయం కూడా సిస్టమ్‌లో కనిపిస్తుంది. దీంతో మధ్యలో ఏదైనా స్టేషన్ నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించే ప్రయాణికులకు ఇది ఉపయోగపడుతుంది.