
సీడ్ వ్యాపారికి ఫేవర్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిన్‌ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం. గోవర్దన్ అగ్రోనమి కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్‌కు డీన్‌గా పనిచేస్తున్నాడు. సీడ్ వ్యాపారం చేసే వ్యక్తి వ్యవసాయ శాఖ నుంచి సీడ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే డీన్ గోవర్దన్‌ను కలిశాడు, లంచడం డిమాండ్ చేయడంతో గతంలో రూ.25,000 ఇచ్చాడు.
అయినా కూడా మరో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు డీన్ గోవర్దన్‌కు లక్ష రూపాయలు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టు హాజరుపర్చారు. కోర్టు ప్రొఫెసర్‌కు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.