
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సిడ్నీలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్ అరెస్టైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొంటున్న వార్నర్.. తన ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్ మ్యాచ్‌ల మధ్య విరామం రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాడు. ఈ క్రమంలో సిడ్నీలో మద్యం తాగి వాహనం నడిపినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సిడ్నీలోని మరూబ్రాలో పోలీసులు బ్రీత్ టెస్ట్ చేస్తుండగా.. టెస్టింగ్ ప్రదేశానికి చేరుకోవడానికి ముందే వార్నర్ తన వాహనాన్ని ఆపి పార్క్ చేశారని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు అతని వద్దకు వెళ్లి పరీక్షించగా, బ్రీత్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు వార్నర్ ను అదుపులోకి తీసుకుని మరూబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.