
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై యుఎస్‌ఎ మెక్‌విన్ గ్రూప్ సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు, -నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ “విడుదలకు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వకారణం. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి”అని అన్నారు.