
రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ కేంద్రం(ఐఎండి). తెలంగాణ, ఎపిలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని.. అలాగే, సూర్యపేట, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతోపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తర వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.