Reading Time: < 1 minute

హైదరాబాద్: సచివాలయంలో రవాణా శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖ లో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు సంబంధించిన బుక్ లెట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించడం జరిగింది. రహవీర్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత తొలి రహవీర్ అవార్డు గ్రహీత నల్గొండ జిల్లాకి చెందిన గణపతి వెంకన్నకి 25 వేల రూపాయల చెక్కు అందిండం జరిగింది.  రవాణా శాఖ 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం, టార్గెట్ రీచ్ అయిన జిల్లాలు తదితర అంశాలపై చర్చించారు. రవాణా శాఖలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచుతూ ఆదాయ మార్గాలు పెంచుకునేలా సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్‌గా కె. ఇలాంబర్తి , జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్, డిటిసిలు , డిటిఒలు , ఆర్ డిఒలు , ఎంవిఐ లు , ఎఎంవిఐలు పాల్గొన్నారు.