Reading Time: < 1 minute

హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎప్పుడు కూడా సిఎం దగ్గర హోంశాఖ ఉండదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూదోపిడీకి పాల్పడి రూ.లక్షల కోట్లు లూటీ చేస్తున్నారని, ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కోహినూర్ సంస్థ, ఎక్యూఎస్ తో దొంగల్లాగా ప్రెస్ మీట్ పెట్టించారని, విలేకరులు అడిగిన ప్రశ్నలకు కంపెనీలు నీళ్లు నమిలాయని ఎద్దేవా చేశారు. రాఘవ కన్ స్ట్రక్షన్ ది కాదని చెబుతున్నారని, అక్కడ పెయింట్ చెరిపేస్తే పేరు కనిపిస్తుందని తెలియజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారని  మండిపడ్డారు. బిఆర్ఎస్ నేతల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.