Reading Time: 2 minutes

పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడినిని పోచమ్మ కొట్టింది అని సామెత, ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి. సరిగ్గా ఇలాంటి ఆలోచన 1927లో జాన్ వాగ్నర్ కు వచ్చింది. అతను ఆస్ట్రియా వైద్యుడు. ఆ కాలంలో సిఫిలిస్ జబ్బు చాలా ఎక్కువగా ఉండేదని, అందులో మూడు స్టేజీలు ఉంటాయి. మూడవ స్టేజిలో బ్రెయిన్ కు వస్తుంది. ఇది ట్రిపోనిమా పాలిడియం అనే క్రిమి వలన సిఫిలిస్ సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గా వస్తుంది. మెదడుకు వచ్చినప్పుడు సైకోసిస్ డెవలప్ అయ్యి ఫిట్స్ వచ్చి జనాలు చనిపోయేవారు.

డాక్టర్లు ఏమి చేయాలో వాళ్లకు అర్థం అయ్యేది కాదు. వాళ్లకు దానిని ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలియక తల పట్టుకునేవారు. అప్పుడు ఆస్ట్రియా వైద్యుడు ఒక వింత సలహా ఇచ్చాడు. మలేరియా పారసైట్ ద్వారా వచ్చే మలేరియా జ్వరం సైకిల్స్ లో అతి తీవ్రమైన జనాన్ని పుట్టిస్తుంది. ఆ జ్వరం తీవ్రత వలన ఆ వేడికి శరీరంలోని ఆ సిఫిలిస్ కలుగచేసే క్రిమి చనిపోతుంది. ప్రజలు ఆ జ్వరాన్ని ఓర్చుకుంటే తరువాత ఆ క్రిమి చనిపోయి పేషెంట్ సేఫ్ అవుతారు. పేషెంట్ కు మరల ఆ మలేరియా నుంచి బాగు చేయడానికి అప్పటికే క్వినైన్ ద్వారా బాగు చేసే పధ్ధతి ప్రాచుర్యం లో ఉంది.

మొదట దీనిని అందరూ వ్యతిరేకించినా కానీ గత్యంతరం లేక దాననే పాటించారు. అనూహ్యంగా పేషెంట్లు బాగు కావడం మొదలైంది. ఇది ఒక స్టాండర్డ్ ధిరపిగా 50 సంవత్సరాలు కొనసాగింది ఆయనకు నోబుల్ ప్రైజ్ కూడా వచ్చింది. 1940 లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కోవడంతో ఈ మలేరియా థెరపీ మూలన పడిపోయింది. ఇప్పుడు ఒక మలేరియా ప్రాణాంతక రోగంతో చేసే ఈ మలేరియా ధిరపి చికిత్స సిఫిలిస్ కు అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ పెన్సిలిన్ అనేది యాంటీబయోటిక్స్ లో మొట్టమొదటిది, ఇది సిఫిలిస్ క్రిమిని ఈజీగా చంపేస్తుంది. అలా ఏమీ చేయలేని పరిస్థితులలో వైద్యులు ఒక విచిత్రమైన వైద్య విధానం కనిపెట్టినప్పటికీ అది తర్వాత ఆశ్చర్యాన్ని కలిగించిన కానీ అప్పటికి ఎంతోమంది ప్రాణాలను కాపాడింది.

వైద్యం అంతా అలాగే ఉంటుంది. ఈరోజు తప్పైనది రేపు ఒప్పు అవుతాది. ఈరోజు ఒప్పు అయినది రేపు తప్పు కూడా కావచ్చు.  ఎల్లప్పుడూ నిత్య నూతనంగా సరికొత్త వైద్య విధానాలు ఆవిష్కరించడం వలన పాత విధానాలను మార్పు చేస్తూ ఉంటారు.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎసిహెచ్ 

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు