
మెదక్: కులం పేరుతో తమను దూషించడంతో పాటు తీవ్రంగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు కొడుతున్నారని గురుకుల విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లిలో జరిగింది. కౌడిపల్లిలో గురుకుల విద్యార్థులు జాతీయ రహదారిపైకి చేరుకొని ధర్నాకు దిగారు. పదే పదే కులం పేరుతో ప్రిన్సిపల్ ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయుడు ఉదయ్ తమను వేధిస్తున్నారని విద్యార్థులు నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్, సదురు ఉప్యాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులక సర్ది చెప్పడంతో ఎంఇఒకు సమాచారం ఇచ్చారు.