
మహబూబాబాద్: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగిని సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గుండె శివారు వాగ్య తండాలో తేజావత్ రఘురాం అనే యువకుడు తన తల్లిదండ్రులకు కలిసి ఉంటున్నాడు. కేసముద్రం మండలం రేకుల తండాలో గూగులోత్ స్పందన నివసిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా స్పందన, రఘురామ్ గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని పలుమార్లు రఘును అడిగిన కూడా దాటవేస్తుండడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. పరిష్కారం కాకపోవడంతో రఘురామ్ ఇంటి ముందు స్పందన మౌన పోరాటానికి దిగింది.