Reading Time: < 1 minute

హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బిఆర్ఎస్ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హరీశ్ రావు నివాసం వద్ద పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతల గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్తుండగా మహేష్ అరెస్టు చేసి కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.