
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడలోని బట్టల షాప్ లో మంటలు చెలరేగడంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. సిద్ధి వినాయక టెక్స్టైల్స్ షాప్ రెండు ఫ్లోర్ లలో ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతలతోనే షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.