
తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మోడరన్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యా ణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజ య్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మాన స చౌదరి హీరోయిన్లు. మేకర్స్ ఇప్పుడు మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తిని బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ’గాయపడ్డ సింహం’ మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. గ్లిం ప్స్ లాంచ్ ప్రెస్ మీట్‌లో జేడి చక్రవర్తి మాట్లాడుతూ “ధర్మ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్ కూడా ఇలాంటి పాత్ర చేసి ఉం డరు. అంత గొప్ప పాత్ర ఇందులో చేశాను”అని అన్నారు. డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ “గాయపడ్డ సింహం అంటే తరుణ్ భాస్కర్ ఒక్కరే కాదు, ఇంకా ఉన్నారని ముందే చెప్పాను. అది జెడి. అలాగే జెడి బెస్ట్ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తాయి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ సాదినేని, భాను కిరణ్ ప్రతాప్ పాల్గొన్నారు.