
హైదరాబాద్: ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్‌లోనే బాలింత మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలంలో జరిగింది. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్ మధ్య జరగడంతో ఉప్పల్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్ లో బిష్ణ(30) అనే బాలింత ప్రయాణిస్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చికుక్కుపోవడంతో ఆక్సజన్ అందకపోవడంతో అందులోనే ఆమె కన్నుమూసింది. సదురు మహిళకు ముగ్గురు పిల్లలతో 26 రోజుల పసికందు కూడా ఉంది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐపిఎల్ మ్యాచ్ జరిగినప్పుడల్లా ఉప్పల్ లో టాఫిక్ జామ్ ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. హబ్సిగూడ చౌరస్తా నుంచి ఉప్పల్ బస్టాండ్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుందని స్థానికులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.