Reading Time: < 1 minute

హీరో నాగ శౌర్య… రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ’బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంలో మాస్ అవతార్‌తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ పాటలు, పవర్-ప్యాక్డ్ టీజర్‌తో భారీ అంచనాలను సృష్టించింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సినిమా మాస్ యాక్షన్, డ్రామా, రొమా న్స్, కామెడీ అన్నీ కలిపిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా రానుందని ట్రైలర్ తెలియజేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ “ఆరెంజ్ సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్ జయరాజ్‌తో వర్క్ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రభాస్ ‘ఈశ్వర్‘ సినిమాలో శ్రీదేవిని చూశాను.

అలాంటి అదృష్టం నాకు కూడా ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. శ్రీదేవి విజయ్‌కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. శౌర్య చాలా టాలెంటెడ్. అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను”అని అన్నారు. కెమెరామెన్ రసూల్ మాట్లాడుతూ “చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ “శౌర్యతో కలిసి ఒక మంచి సినిమా తీశాం. జీ వారికి ఈ సినిమా చూపించగానే, ఓటిటి రైట్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా వారే చేస్తామని చెప్పారు. శౌర్యతో మరోసారి కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు.