Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఏప్రిల్ నెల రాష్ట్రం లో విచిత్రమయిన వాతావరణ పరిస్థితులకు బిం దువుగా మారింది. మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో చాలా ప్రాంతా ల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా చేరుకున్నా యి. పలు ప్రాంతాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో గా లులతో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎండ ల వేడికి ఆదివారం 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యధికంగా ఖమ్మం జిల్లా ల్లో 41.4 డిగ్రీలు నమోదయ్యింది. దీంతో పాటు రాబోయే మూడు రోజులు పా టు పలు జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఇదే వాతావరణ శాఖ రాబో యే మూడు రోజుల పాటు ప లు జిల్లాల్లో అక్కడక్కడ వర్షా లు కురుస్తాయని వెల్లడించిం ది. గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉరుములతో కూడిన వర్షాలతో వాతావరణం చల్లబడింది.

అయితే ఎండల తీవ్రత పెరగనుందని, ఏప్రిల్ 10 తర్వాత వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్’ హెచ్చరించారు. ఏప్రిల్ 10 తర్వాత ఉత్త ర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయని పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా వేడి పెరగనుందని, ఇక్కడ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని వెల్లడించారు. ఎండల తీవ్రత, వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు  తమ ప్రయాణాలను తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తపడాలని కోరారు.

మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం రెండు నుంచి మూడు డిగ్రీల మేర క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.