Reading Time: < 1 minute
Karthi Mohan Raja Movie Nayanthara Trisha Heroine Update

Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు కోలీవుడ్‌లో తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మేకర్స్ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ముందుగా స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నయనతార డేట్స్ అందుబాటులో ఉంటే ఆమెనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

గతంలో కార్తీ, నయనతార కలిసి ‘కాశ్మోరా’ సినిమాలో నటించగా, వారి జోడీకి మంచి ఆదరణ లభించింది. అలాగే దర్శకుడు మోహన్ రాజా – నయనతార కాంబినేషన్‌లో ‘తని ఒరువన్’, ‘వేలైక్కారన్’, ‘గాడ్‌ఫాదర్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. దీంతో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. అయితే ఒకవేళ నయనతార డేట్స్ అందుబాటులో లేకపోతే, స్టార్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసే అవకాశాలను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలా జరిగితే ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత కార్తీ – త్రిష జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కాంబినేషన్‌పై కూడా అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే హీరోయిన్ ఎంపికకు సంబంధించి ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.