Reading Time: < 1 minute

లెమన్ అండ్ స్పూన్ గేమ్ లో.. మంత్రి కొండా సురేఖకు ఫస్ట్ ప్రైజ్

Caption of Image.

నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా క్రీడాకారులుగా మారారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల  స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026  లో భాగంగా సందడి చేశారు.  శనివారం (మార్చి 28న) సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. 

హైదరాబాద్​ లోని ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, కల్చరల్​ మీట్​2026 లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి,  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాక్టివ్​ గా పాల్గొన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి విద్యార్థులతో కలిసి పుట్​ బాల్​ఆడి ఆకట్టుకున్నారు. 

►ALSO READ | మరోసారి ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్.. గోల్ కొట్టి అదరగొట్టారు !

లెమన్​ అండ్​ స్పూన్​ పోటీల్లో మంత్రి కొండా సురేఖా మొదటి స్థానంలో ఉండగా ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయి తర్వాతి స్థానాల్లో నిలిచారు. స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్​ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.