Reading Time: 2 minutes

అన్‌ఫాలోతో అగ్ని రాజేసిన రిషబ్ శెట్టి: కాంతార హీరోయిన్తో పాటు హోంబలేని కూడా.. కారణం ఏంటి?

Caption of Image.

కన్నడ స్టార్ నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా రిలీజ్ కారణంగా కాదు, సోషల్ మీడియాలో ఆయన చేసిన చర్యల వల్ల చర్చనీయాంశమయ్యారు.

సహనటులను అన్‌ఫాలో చేశారా?

నివేదికల ప్రకారం, రిషబ్ శెట్టి తన సహనటులు అయిన వర్సటైల్ యాక్టర్ కం డైరెక్టర్ రాజ్ బి శెట్టి, హీరోయిన్ రుక్మిణి వసంత్ లను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఫాలోయింగ్ లిస్ట్‌లో వారి పేర్లు కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు దారితీసింది.

ఇదే సమయంలో, ఆయన ‘కాంతార’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ని (Hombale Films) కూడా అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. దీంతో ఈ పరిణామం వెనుక ఏదైనా విభేదం ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయా?

ఆసక్తికర విషయం ఏమిటంటే, హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ ని మాత్రం ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. దీన్ని బట్టి ఇది పూర్తిస్థాయి విభేదం కాదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా..ప్రస్తుతం రిషబ్ శెట్టి సోషల్ మీడియా చర్యల వెనుక అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఈ పరిణామం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్: ‘జై హనుమాన్’

రిషబ్ శెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్:  ‘జై హనుమాన్’ లో నటిస్తున్నాడు. ఈ భారీ మైథాలజికల్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. 2024లో వచ్చిన హను-మాన్ కి ఇది సీక్వెల్. ఇందులో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 ఫిబ్రవరిలో హంపిలో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది.2027 సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని రానుంది.  

కాంతార: చాప్టర్ 1 గురించి:

నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ రికార్డు వసూళ్లు సాధించింది.  2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. 2025 ఆక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ  ప్రపంచ వ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

2022లో వచ్చిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కథ, వలసరాజ్యాల పూర్వం నాటి తీరప్రాంత కర్ణాటక నేపథ్యంలో సాగుతుంది. దైవ కోల లేదా భూత కోల సంప్రదాయం యొక్క మూలాలను, దాని ఆధ్యాత్మిక లోతును ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరించింది.

►ALSO READ | Anirudh Wedding: ఐపీఎల్ బ్యూటీతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్ అయిందా?.. హాట్ టాపిక్‌గా మారిన స్టార్స్ రిలేషన్!

గిరిజన నాయకుడైన బెర్మే (రిషబ్ శెట్టి) తన ప్రజల విశ్వాసాలను, భూమిని అణచివేతకు గురిచేసే ధనిక వర్గానికి వ్యతిరేకంగా ఎలా పోరాడాడనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు.

అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం, అరవింద్ కశ్యప్ విజువల్స్ సినిమాకు ప్రాణం పోశాయి. నమ్మకం, జానపద కథలు, శక్తివంతమైన కథనం కలగలిసిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

©️ VIL Media Pvt Ltd.