
RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ ఈరోజు ఘనంగా ప్రారంభం కాబోతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. గత సీజన్‌లో తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి వరుసగా రెండో టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన సన్‌రైజర్స్ ఈసారి బలంగా పునరాగమనం చేయాలని చూస్తోంది.
ఆర్సీబీ బలాలు:
రజత్ పాటిదార్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బరిలోకి దిగబోతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేస్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, నువాన్ తుషార తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేరు. అలాగే యశ్ దయాల్ మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో బౌలింగ్ బాధ్యతలు భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్, రసిక్ సలామ్ మోయనున్నారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ లాంటి ఆటగాళ్లు కీలకం కానున్నారు. వికెట్ కీపింగ్ బాధ్యతలను జితేష్ శర్మ నిర్వహించనున్నాడు. అలాగే రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లు చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం కలిగి ఉన్నారు.
►ALSO READ | Sunrisers Hyderabad: ఎస్ఆర్హెచ్ ఈ తప్పులని సరి చేసుకోవాల్సిందే.. లేకపోతే ఫస్ట్ మ్యాచ్ అస్సామే!
సన్‌రైజర్స్ బలాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. జట్టు ప్రధాన ఆటగాడు ప్యాట్ కమిన్స్ తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్ తాత్కాలిక నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హైన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లు టాప్ ఆర్డర్‌ను బలంగా నిలబెడతారు. మిడిల్ లో నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్ లాంటి ప్లేయర్స్ జట్టుకు అదనపు బలంగా మారనున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ ఉన్నప్పటికీ, ప్యాట్ కమిన్స్ లేకపోవడం జట్టు కొంత బలహీనంగా కనిపిస్తుంది.
టాస్ ఎప్పుడు?:
ఈ మ్యాచ్ సాయంత్రం 7: 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. టాస్ సాయంత్రం 7 గంటలకి పడనుంది.
ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?:
ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.
ఎవరు గెలుస్తారు?:
బెంగళూరులో ఎస్ఆర్‌హెచ్‌పై గెలవడానికి ఆర్‌సీబీ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. హోమ్ గ్రౌండ్ ప్రయోజనం, బలమైన బ్యాటింగ్ లైనప్, ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న ఆత్మవిశ్వాసం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, SRH బ్యాటింగ్ లైనప్ గనుక క్లిక్ అయితే చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయం.
పిచ్ రిపోర్టు:
చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ. (ఇంపాక్ట్ ప్లేయర్: మంగేష్ యాదవ్)
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషాన్ అన్సారీ, శివం మావి. (ఇంపాక్ట్ ప్లేయర్: అనికేత్ వర్మ)