Reading Time: < 1 minute

నేరెళ్ల ఇసుక మాఫియా గుర్తుందా కేటీఆర్.. దళిత యువకులను చిత్రహింసలు పెట్టింది మర్చిపోయావా : మంత్రి వాకిటి 

Caption of Image.

అసెంబ్లీలో మైనింగ్ అంశాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి వాకిటి శ్రీహరి. ఓ మంత్రికి సంబంధించిన కంపెనీ పేరును ప్రస్తావిస్తూ.. సభలో ఆరోపణలు ఎలా చేస్తారంటూ హరీశ్ ను ప్రశ్నించారు మంత్రి వాకిటి. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో.. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా ఎలా జరిగిందో.. ఏ స్థాయిలో అరాచకాలు జరిగాయో తెలంగాణ రాష్ట్రం అంతా చూసిందన్నారు మంత్రి వాకిటి. 

బీఆర్ఎస్ హయాంలో.. మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం అయిన నేరళ్ల గ్రామంలో జరిగిన ఇసుమా మాఫియాను గుర్తు చేశారు మంత్రి వాకిటి. రోజుకు వెయ్యి లారీలతో ఇసుక మాఫియా రాజ్యం ఏలిందని.. ఇసుక లారీ కింద పడి ఓ చిన్నారి చనిపోతే.. ప్రశ్నించిన నేరెళ్ల దళిత యువకులను పోలీసులతో చిత్ర హింసలు పెట్టారని గుర్తు చేశారు మంత్రి వాకిటి. 

పోలీస్ నిర్బంధంలో ఉన్న నేరళ దళిత యులకులను అప్పట్లో పరామర్శించటానికి నేను, భట్టి, పొన్నం వెళితే.. దెబ్బలకు తట్టుకోలేకుండా ఉన్నాం అన్నా.. ఇంత విషం ఇచ్చి వెళ్లవే అంటూ ఆ దళిత యువకులు కన్నీళ్లతో చెప్పుకున్న బాధలు గుర్తు లేదా కేటీఆర్ అంటూ.. అసెంబ్లీలోని నిండు సభలో బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు మంత్రి వాకిటి. 

ALSO READ : మాజీ మంత్రి హరీష్ విమర్శలకు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్

కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మైనింగ్ పై విచారణ జరిపించాలని.. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ విధ్వంసంపైనా విచారణ చేద్దామంటూ బీఆర్ఎస్ పార్టీని సవాల్ చేశారు మంత్రి వాకాటి.

©️ VIL Media Pvt Ltd.